Prabhas Project K Update: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో క్రేజీ చిత్రం 'ప్రాజెక్ట్ కె'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ అగ్రకథానాయిక దీపికా పదుకొణె హీరోయిన్. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. బిగ్‌బీ పాత్రకు సంబంధించి ఇటీవలే ఓ ఆసక్తికర అంశం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఆయన ప్రభాస్ తండ్రిగా, సంపన్న వ్యాపారవేత్తగా నటించనున్నారట.
'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్.. సూపర్‌హీరో పాత్రలో నటించనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూళ్ల చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
మరోసారి అదరగొట్టిన మిల్కీ బ్యూటీ..
ఇప్పటికే పలు చిత్రాల్లోని ప్రత్యేక గీతాల్లో కనిపించి, ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన తమన్నా 'గని'తో మరోసారి సందడి చేసింది. వరుణ్‌తేజ్ హీరోగా రూపొందిన 'గని'లో 'కొడితే' అనే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. ఇటీవల విడుదలైన లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించగా చిత్ర బృందం గురువారం పూర్తి వీడియోను విడుదల చేసింది.
ఈ పాటలో ఎప్పటిలానే తమన్నా డ్యాన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. 'గని'కి తమన్ స్వరాలందించారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వరుణ్‌కు జోడీగా సయీ మంజ్రేకర్ నటించింది. జగపతిబాబు, ఉపేంద్ర, నవీన్ చంద్ర, సునీల్‌శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదలకానుంది.
నితిన్‌కు ఉత్తర్వులు..
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాలో నితిన్.. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నటించనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ మేరకు నితిన్‌కు ఉత్వర్తులు జారీ అయ్యాయంటూ గురువారం సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టింది.