'సలార్' కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందా? అవుననే తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. దర్శకుడు ప్రశాంత్ నీల్-హీరో ప్రభాస్ మరోసారి కలిసి పనిచేయనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. డార్లింగ్ 25వ సినిమా కోసం క్రేజీ కాంబో మళ్లీ జట్టుకట్టనుందట. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇప్పటికే ఒప్పందం కూడా జరిగిపోయిందని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. 2023లో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లొచ్చని సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్ట్స్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ, ఏక కాలంలో వాటిని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆయన 'సలార్'తో పాటు 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్', నాగ్అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.