తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Prabhas: ప్రభాస్​.. ఆసియా 'మోస్ట్​ హ్యాండ్​సమ్​ పర్సన్​' - prabhas

హీరో ప్రభాస్(Prabhas)​ అరుదైన ఘనత సాధించారు. ఆసియా మోస్ట్​ హ్యాండ్​సమ్​ మెన్​గా టాప్​లో నిలిచారు. ప్రస్తుతం 'రాధేశ్యామ్'​, 'సలార్'​, 'ఆదిపురుష్'​ సినిమాల్లో నటిస్తున్నారు.

prabhas
ప్రభాస్​

By

Published : Jul 19, 2021, 1:14 PM IST

పాన్​ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్​ బిజీలో ఉన్న రెబల్​స్టార్ ప్రభాస్(Prabhas)..​ అద్భుతమైన ఘనత సొంతం చేసుకున్నారు. ఆసియా 'మోస్ట్​ హ్యాండ్​సమ్ మెన్'​ జాబితాలో అగ్రస్థానంలో నిలిచి, రికార్డు సృష్టించారు. టాప్-10లో ప్రభాస్​తో పాటు మరో భారతీయ నటుడు వీవీయన్ డిసేన ఉండటం విశేషం. ఇతడు ఏడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. పలు హిందీ టీవీ షోలు, సీరియల్స్​లో నటించి, వీవీయన్ గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రభాస్ త్వరలో 'రాధేశ్యామ్'​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'సలార్'​, 'ఆదిపురుష్'​, నాగ్​అశ్విన్​ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

మోస్ట్​ హ్యాండ్​సమ్​ ఆసియన్​ మెన్ టాప్-10

నెం.1 ప్రభాస్(భారత్)​

నెం.2 ఇమ్రాన్​ అబ్బాస్​ నఖ్వీ(పాకిస్థాన్​)

నెం.3 జిన్​ అకనిషి(Jin Akanishi, జపాన్​)

నెం.4 కిమ్​ హ్యూన్​ జూంగ్​(Kim Hyoon Joong, దక్షిణ కొరియా)

నెం.5 నహాన్​ ఫుక్​​​ విన్​​(Nhan Phuc Vinh, వియాత్నం)

నెం.6 హుఆంగ్​ షౌమింగ్​(Huang Xiaoming, చైనా)

నెం.7 వీవీయన్ డిసేన(Vivian Dsena, భారత్​)

నెం.8 ఫావద్​ ఖాన్​(పాకిస్థాన్​)

నెం.9 థనావట్​ వట్టనపుటి(Thanavat Vattanaputi, థాయ్​లాండ్​)

నెం.10 వాలెస్​ హ్యూ(తైవాన్​)

ఇదీ చూడండి: 'రాధేశ్యామ్' నుంచి సర్​ప్రైజ్.. ప్రభాస్ కొత్త లుక్

ABOUT THE AUTHOR

...view details