పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా వచ్చిన 'రాధేశ్యామ్' టీజర్.. సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేసింది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఓ విషయం తెగ ఆసక్తి కలిగిస్తోంది.
అయితే సినిమాను కొన్ని ఆసక్తికర ట్విస్ట్‌లతో ముగిస్తారట. దీంతో తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతుందని చిత్రబృందం భావిస్తోంది. తద్వాతా సీక్వెల్ తీయొచ్చని అనుకుంటున్నారట. కానీ 'రాధేశ్యామ్' బడ్జెట్ చెప్పిన దానికంటే మించిపోయింది. దీంతో సినిమాకు వచ్చిన ఆదరణ బట్టి సీక్వెల్ తీయాలా వద్దా అని ఆలోచిస్తారట.