Prabhas sandeep reddy vanga movie: డార్లింగ్ ప్రభాస్ పోలీస్ పాత్రలో సందడి చేయనున్నారు. ఆ విషయాన్ని నిర్మాత భూషణ్‌కుమార్ స్వయంగా వెల్లడించారు. మాస్ కథానాయకుడిగా.. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రభాస్.. ఇప్పటిదాకా తన కెరీర్‌లో పోలీస్ రోల్ చేయలేదు.
ఇప్పుడు 'స్పిరిట్'తో తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా 'స్పిరిట్' తీస్తున్నారు. ప్రభాస్ 25వ సినిమాగా, పాన్ ఇండియా స్థాయిలో భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. షూటింగ్‌తో పాటు ఇతర వివరాలు త్వరలో ప్రకటించే అవకాశముంది.