యంగ్ రెబర్‌స్టార్ ప్రభాస్ బాహుబలి, సాహో చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు చేస్తూ జోరు చూపిస్తున్నాడు. ఈ హీరో ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే చిత్రం చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం తర్వాత నాగ్ అశ్విన్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.
నాగ్ అశ్విన్ చిత్రంలో ప్రభాస్ డ్యుయల్ రోల్!
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
నాగ్ అశ్విన్ చిత్రంలో ప్రభాస్ డ్యుయల్ రోల్!
సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. ఇందులో డార్లింగ్ రెండు విభిన్న పాత్రలు పోషించబోతున్నాడని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాధేశ్యామ్ ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదలై మంచి స్పందన రాబట్టింది. ఇందులో పూజా హెగ్దే హీరోయిన్గా నటించనుంది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత షూటింగ్ పునఃప్రారంభం కానుంది.