ప్రభాస్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ చిత్రం కోసం రంగంలోకి దిగుతాడు. వీటి తర్వాత సినిమాపై కూడా ఆయన ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తన సొంత సంస్థ లాంటి యువీ క్రియేషన్స్‌లోనే ఆ సినిమాని చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ సినిమా? - ప్రభాస్ వార్తలు
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం ప్రభాస్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడితో తన తర్వాత సినిమా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ సినిమా?
ఈ చిత్రాన్ని బాలీవుడ్‌కి చెందిన దర్శకుడు తెరకెక్కించే అవకాశాలున్నట్టు సమాచారం. అయితే ప్రభాస్ ఏ భాషలో సినిమా చేసినా.. ఏ దర్శకుడితో చేసినా అది ఇతర భాషల్లోనూ విడుదలవుతుంది. పాన్ ఇండియా స్థాయిలోనే ఆయన సినిమాలు రూపొందుతుంటాయి.
ఇదీ చూడండి:డార్లింగ్ ఫ్యాన్స్ హంగామా.. ట్రెండింగ్‌లో 'ప్రభాస్20'