తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వచ్చే నెల నుంచే ప్రభాస్​ సినిమా కొత్త షెడ్యూల్​! - prabhas new movie schedule started in november

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా మరో షెడ్యూల్.. వచ్చే నెల నుంచి హైదరాబాద్​లో జరగనుంది. ఇందుకోసం భారీ సెట్​ను రూపొందిస్తున్నారని సమచారం.

ప్రభాస్​ సినిమా కొత్త షెడ్యూల్​ హైదరాబాద్​లో!

By

Published : Oct 27, 2019, 7:04 PM IST

'సాహో'తో ఆకట్టుకున్న డార్లింగ్ హీరో ప్రభాస్.. ప్రస్తుతం ఓ త్రిభాషా చిత్రం చేస్తున్నాడు. 'జిల్' వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అందించిన కె.కె. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఇటలీలో ఓ షెడ్యూల్​ పూర్తి చేసుకుంది. వచ్చే నెల హైదరాబాద్​లో కొత్త షెడ్యూల్​ ప్రారంభం కానుంది. అందుకోసం భారీ సెట్​ను రూపొందిస్తున్నారని సమాచారం.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. జాన్​ అనే టైటిల్​ ప్రచారంలో ఉంది. అమిత్ త్రివేది స్వరాలు సమకూర్చుతున్నాడు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి : హీరో మంచు మనోజ్ కొత్త ప్రయాణం మొదలు..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details