తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జాన్' బాలీవుడ్​కు వెళ్లడా.. కారణం ఇదేనా..? - cinema news

డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా 'జాన్​'ను బాలీవుడ్​లో విడుదల చేయకూడదని భావిస్తోంది చిత్రబృందం. గత చిత్రం 'సాహో' ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

డార్లింగ్ ప్రభాస్

By

Published : Nov 12, 2019, 5:26 AM IST

'బాహుబలి', 'సాహో'లతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హీరో ప్రభాస్‌. అలాంటిది ఇప్పుడు తను నటించే కొత్త చిత్రం 'జాన్‌'ను బాలీవుడ్‌ ప్రేక్షకులు చూసే అవకాశం లేదట.

కారణమిదేనా?

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' సిరీస్..​ ప్రభాస్‌ మార్కెట్​ను అమాంతం పెంచేసింది. అందుకు తగ్గట్లుగానే 'సాహో'లో శ్రద్ధాకపూర్, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ తదితర బాలీవుడ్‌ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఆ సినిమా హిందీలో ఆశించినంత ఫలితం అందుకోలేదు. అందుకే 'జాన్‌'ను అక్కడ విడుదల చేసేందుకు విముఖత చూపుతున్నారట.

హీరో డార్లింగ్ ప్రభాస్

రొమాంటిక్‌ ప్రేమకథా నేపథ్యంలో వస్తున్న 'జాన్'లో పూజా హెగ్డే హీరోయిన్. అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. కె.కె.రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్​లో షూటింగ్ జరుపుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details