డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ వచ్చేసింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ సోషల్ మీడియాలో పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. మరోసారి స్టైలిష్ లుక్‌తో అదరగొట్టాడు ప్రభాస్. పూజా హెగ్దేతో పాటు ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. 'రాధే శ్యామ్' అనే టైటిల్ ఖరారు చేశారు.
రొమాంటిక్ లుక్‌తో అదరగొట్టిన ప్రభాస్, పూజ - ప్రభాస్ రాధేశ్యామ్
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా టైటిల్‌తో పాటు అతడి లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ఈ హీరో స్టైలిష్ లుక్‌తో అదరగొడుతున్నాడు.
స్టైలిష్ లుక్‌తో అదరగొట్టిన ప్రభాస్, పూజ
1920ల నాటి కథతో యూరప్ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరుపుకొంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Last Updated : Jul 10, 2020, 10:55 AM IST