నటుడు కృష్ణంరాజు 80వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో సందడిగా జరిగాయి. పలువరు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డార్లింగ్ హీరో ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ ఈవెంట్‌కు సీనియర్ నటుడు మోహన్‌బాబు కుటుంబ సమేతంగా వచ్చాడు. పెదనాన్న కృష్ణంరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. అంచలంచెలుగా ఎదిగి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
హీరో ప్రభాస్ కొత్తలుక్.. ఖుషీ అవుతున్న అభిమానులు - tollywood news
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్.. తన పెదనాన్న, సీనియర్ నటుడు కృష్ణంరాజు జన్మదిన వేడుకల్లో సందడి చేశాడు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్న ఈ ఈవెంట్లో డార్లింగ్ హీరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

మంచు లక్ష్మితో ప్రభాస్
ప్రభాస్ కొత్త సినిమా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 1960ల నాటి కథతో తీస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.