సాహో చిత్రం తర్వాత ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్‌తో ఓ సినిమా చేస్తున్నాడు డార్లింగ్. తాజాగా ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్.
ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరపుకుంటోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరగుతోంది. ఇందుకు సంబంధించిన ఓ భారీ సెట్‌ను రూపొందించినట్లు సమాచారం.