ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సినిమాకి సంబంధించి.. ప్రి విజువలైజేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యమున్న సినిమా కావడం వల్ల అందుకు సంబంధించిన పనుల్ని ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో.. నాగ్ అశ్విన్, ఆయన బృందం బిజీ బిజీగా ఉన్నారు.
అయితే జులై 19 (ఆదివారం) ఈ సినిమాకి సంబంధించిన ఓ కొత్త విషయాన్ని చెప్పనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు పెట్టింది. దీనిపై సినీప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో పాటు కథానాయిక ఎంపికపై దృష్టి పెట్టారు నాగ్ అశ్విన్. ఓ బాలీవుడ్ నాయిక ఈ సినిమాలో మెరవబోతున్నట్టు టాక్.