తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్​-నాగ్ అశ్విన్ మూవీ అప్​డేట్​కు వేళాయే - ప్రభాస్​-నాగ్ అశ్విన్ మూవీ అప్​డేట్​ ట

యంగ్ రెబల్​స్టార్ ప్రభాస్ అభిమానులకు సర్​ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్​తో తాను తెరకెక్కిస్తోన్న మూవీకి సంబంధించిన అప్​డేట్ గురించి చెప్పేశాడు.

Prabhas-Nag Ashwin
ప్రభాస్​-నాగ్ అశ్విన్

By

Published : Jan 23, 2021, 1:01 PM IST

యంగ్ రెబల్​స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. త్వరలో ప్రభాస్‌ హీరోగా తాను తెరకెక్కించనున్న చిత్రానికి సంబంధించి ఓ అప్‌డేట్‌ను ఇస్తానని డేట్స్‌తో సహా ప్రకటించాడు.

వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై నాగ్‌అశ్విన్‌-ప్రభాస్‌ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె కథానాయికగా కనిపించనుంది. అలాగే బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.

కాగా, సంక్రాంతి పండగ తర్వాత తమ చిత్రానికి సంబంధించి ఓ ప్రత్యేకమైన అప్‌డేట్‌ ఇస్తానని దర్శకుడు నాగ్‌అశ్విన్‌ ఈ ఏడాది ఆరంభంలో చెప్పాడు. ఈ క్రమంలోనే పండగ పూర్తియి పదిరోజులు కావొస్తున్నా ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకపోవడం వల్ల నెటిజన్లు ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీంతో స్పందించిన అశ్విన్‌.. "జనవరి 29న కానీ ఫిబ్రవరి 26న కానీ కచ్చితంగా అప్‌డేట్‌ ఉంటుంది" అని సమాధానమిచ్చాడు.

ABOUT THE AUTHOR

...view details