అగ్ర కథానాయకుడు ప్రభాస్ కొత్త సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియోను ట్వీట్ చేసింది.
ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ - prabhas amitabh bachchan
ప్రభాస్ కొత్త సినిమాలో స్టార్ అమితాబ్ బచ్చన్.. కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ వెల్లడించింది.
ప్రభాస్ దీపికా పదుకొణె
సైన్స్ ఫిక్షన్ కథతో తీస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్. దిగ్గజ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరులో షూటింగ్ ప్రారంభించి, 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.