తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్ హారర్ కామెడీ సినిమా.. 'ఆర్ఆర్ఆర్' నిర్మాతతో! - prabhas spirit movie

Prabhas maruthi movie: విభిన్న కథలతో అభిమానుల్ని మెప్పించేందుకు సిద్ధమవుతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇప్పుడు హారర్ కామెడీ కథలో నటించనున్నారు! డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

prabhas
ప్రభాస్

By

Published : Jan 22, 2022, 7:06 AM IST

Updated : Jan 22, 2022, 10:23 AM IST

Prabhas movies: డార్లింగ్ ప్రభాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చారు! ఇప్పటికే నాలుగైదు చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. యువ దర్శకుడు మారుతితో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారట.

హారర్ కామెడీ కథతో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. దీనికి 'రాజా డీలక్స్' అని టైటిల్​ కూడా అనుకుంటున్నారని సమాచారం. 'ఆర్ఆర్ఆర్' ఫేమ్ డీవీవీ దానయ్య.. ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ ఏడాది వేసవి తర్వాత షూటింగ్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రభాస్-మారుతి

సంక్రాంతి రిలీజ్ కావాల్సిన ప్రభాస్ 'రాధేశ్యామ్'.. వాయిదా పడింది. మార్చిలో ఇది థియేటర్లలోకి రానుంది. దీనితో పాటు 'సలార్', 'ఆదిపురుష్' సినిమాలు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దర్శకులు నాగ్ అశ్విన్ 'ప్రాజెక్టు కె', సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' సినిమాలు కూడా ప్రభాస్ చేస్తున్నారు. ఇప్పుడు మారుతితో పనిచేసేందుకు రెడీ అయి అభిమానుల్ని ఆశ్చర్యపరిచారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

Last Updated : Jan 22, 2022, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details