ఏకకాలంలో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్.. ప్రస్తుతం 'రాధేశ్యామ్' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో శనివారం నుంచే చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందుకోసం భారీ సెట్‌ను కూడా నిర్మించారట.
కీలకమైన చివరి షెడ్యూల్లో 'రాధేశ్యామ్' - ప్రభాస్ న్యూస్
మరో మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'రాధేశ్యామ్' చివరి షెడ్యూల్‌తో బిజీగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్‌పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
కీలకమైన చివరి షెడ్యూల్లో 'రాధేశ్యామ్'
ఎడిటింగ్‌లో ఉన్న కొన్ని సీన్లకు కొన్నిరోజుల క్రితం చూసిన ప్రభాస్.. వాటిని రీషూట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. వాటిని ఇప్పుడు తీస్తున్నట్లు సమాచారం.
70ల నాటి కథతో, ఐరోపా నేపథ్యంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ఈ ఏడాది జులై 30న థియేటర్లలోకి రానుందీ చిత్రం.