ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్ నన్ను ర్యాగింగ్ చేశారు: పూజా హెగ్డే - Radhe shyam teaser

'రాధేశ్యామ్' చిత్రీకరణ విశేషాలను పంచుకున్న పూజా హెగ్డే.. ప్రభాస్​తో ఉన్న బాండింగ్​ గురించి చెప్పింది. తనను చాలాసార్లు ర్యాగింగ్ చేశాడని తెలిపింది.

Prabhas keeps ragging pooja hegde on Radhe shyam set
ప్రభాస్ నన్ను ర్యాగింగ్ చేశాడు: పూజా హెగ్డే
author img

By

Published : Feb 19, 2021, 9:19 AM IST

ప్రభాస్ అందరూ అనుకున్నంత సిగ్గరి కాదని హీరోయిన్ పూజా హెగ్డే చెప్పింది. 'రాధేశ్యామ్' షూటింగ్​లో అప్పుడప్పుడు తనను ర్యాగింగ్ చేసేవారని తెలిపింది. దీనితో పాటు సినిమా అనుభవాల్ని పంచుకుంది.

"సెట్​లో ఉంటే ప్రభాస్ అంత సిగ్గరి ఏం కాదు. ఆయనతో ఉంటే సహనటీనటులకు సౌకర్యంగా ఉంటుంది. సెట్​లో ప్రభాస్ ఉంటే సందడే సందడి. అయితే తెలియని వాళ్లతో మాట్లాడేటప్పుడు మాత్రమే ఆయన సిగ్గుపడతారు"

in article image
రాధేశ్యామ్​లో ప్రభాస్, పూజా హెగ్డే

"రాధేశ్యామ్' అన్ని ప్రేమకథల్లాంటిది కాదు. కొత్తగా ఉంటుంది. చిత్రీకరణ మొదలైన తొలి రోజు నుంచే మేం స్నేహితులుగా మారడం వల్ల మా మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వచ్చింది. సినిమా మీకు కచ్చితంగా నచ్చుతుంది" అని పూజా హెగ్డే చెప్పింది. ఈమె నటించిన 'మోస్ట్​ ఎలిజిబుల్ బ్యాచ్​లర్', 'సర్కస్', 'ఆచార్య' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details