'సాహో' తర్వాత ప్రభాస్ ఎలాంటి చిత్రంలో నటించనున్నాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ 'జాన్' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ ఈ నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.
ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంగా వస్తున్న సినిమాను కృష్ణంరాజు స్వంత సంస్థ అయిన గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.