తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్ ప్రతిష్ఠాత్మక సినిమా ప్రారంభం - movie news

డార్లింగ్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్​లోని సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. తొలిరోజు అమితాబ్​పై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.

Prabhas gives first clap for Amitabh Bachchan as Nag Ashwin's sci-fi film
ప్రభాస్

By

Published : Jul 24, 2021, 2:33 PM IST

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రతిష్ఠాత్మక చిత్రం ప్రారంభమైంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'ప్రాజెక్ట్‌ కే' అనే వర్కింగ్‌ టైటిల్​గా ఫిక్స్ చేశారు. గురు పూర్ణిమ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఇందులో ప్రభాస్‌తోపాటు బాలీవుడ్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ పాల్గొన్నారు. ముహూర్తపు షాట్‌కు ప్రభాస్‌ క్లాప్‌ కొట్టారు. ఇందులో భాగంగా బిగ్‌బీపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఫొటో షేర్‌ చేసింది.

క్లాప్ కొడుతున్న ప్రభాస్

పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఇందులో అమితాబ్‌ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందించనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ నిర్మిస్తోంది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్క్రీన్‌ప్లే పర్యవేక్షణ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details