తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టీషర్ట్​ బావుందనగానే.. ప్రభాస్​ గిఫ్ట్‌ ఇచ్చాడు - sujeeth

'సాహో'లో ప్రభాస్​తో కలిసి నటించిన మురళీశర్మ.. షూటింగ్​లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. డార్లింగ్​ హీరో ప్రభాస్​ తనకు టీషర్ట్ బహుమతిగా ఇచ్చాడని చెప్పాడు.

నటుడు మురళీశర్మ

By

Published : Aug 30, 2019, 3:04 PM IST

Updated : Sep 28, 2019, 8:54 PM IST

టాలీవుడ్​, బాలీవుడ్​లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మురళీ శర్మ... ప్రభాస్​ హీరోగా నటించిన భారీ బడ్జె​ట్​ సినిమా ‘సాహో’లో పోలీస్​ పాత్రలో నటించాడు. ప్రేక్షకుల ముందుకుశుక్రవారం వచ్చిందీ చిత్రం. ప్రచారంలో భాగంగా షూటింగ్​లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడీ నటుడు.

''ప్రభాస్‌ని అందరూ డార్లింగ్‌ అని ఎందుకు పిలుస్తారో ఈ సినిమాతో నాకు తెలిసింది. ఓరోజు ప్రభాస్‌ టీషర్ట్ వేసుకొచ్చాడు. 'ఈ టీషర్ట్ భలే ఉంది' అని అన్నాను. సాయంత్రం అయ్యేసరికి అలాంటిదే మరో టీషర్ట్ నాకు బహుమతిగా పంపాడు. 'ఇంటి భోజనం అంటే నాకు చాలా ఇష్టం' అని చెప్పాను. అప్పటి నుంచి షూటింగ్​ అయ్యేవరకూ ప్రభాస్‌ ఇంటి నుంచే నాకు భోజనం వచ్చేది. డార్లింగ్​ ఇంటి గుత్తొంకాయ కూర అదుర్స్‌. ఆ రుచి ఇంకెక్కడా రాదు'' -మురళీ శర్మ, నటుడు

'సాహో' షూటింగ్​ సమయంలో హీరో ప్రభాస్​తో మురళీ శర్మ

ప్రస్తుతం మహేశ్​బాబు హీరోగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురము'లోనూ కీలకపాత్రలను పోషిస్తూ బిజీగా ఉన్నాడు మురళీ శర్మ.

ఇది చదవండి: రన్నింగ్​ ట్రాక్​పై దూసుకెళ్తోన్న తాప్సీ

Last Updated : Sep 28, 2019, 8:54 PM IST

ABOUT THE AUTHOR

...view details