కరోనా ప్రభావంతో చిత్రీకరణలు నిలిచిపోయి, ఉపాధి కోల్పోయిన టాలీవుడ్ వేతన కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్.. తాజాగా రూ.50 లక్షలు ఆ ట్రస్టుకు అందజేనున్నట్లు ప్రకటించాడు. కరోనాను అరికట్టేందుకు ఇప్పటికే ప్రధానమంత్రి సహాయనిధికి రూ.3 కోట్లు.. తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షలు ఇచ్చి ఉదారత చాటుకున్నాడీ కథానాయకుడు.
మరో రూ.50 లక్షలు విరాళమిచ్చిన డార్లింగ్ ప్రభాస్
కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే రూ.4 కోట్లు ఇచ్చిన హీరో ప్రభాస్.. కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.50 లక్షలు విరాళమిచ్చేందుకు సిద్ధమయ్యాడు.
డార్లింగ్ ప్రభాస్
డార్లింగ్‌తో పాటు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ.. సీసీసీకి రూ.75 వేలు విరాళమివ్వగా, దర్శక నిర్మాత సతీశ్ వేగేశ్న.. ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్‌కు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు చెప్పాడు.
ఇది చదవండి:కరోనా క్రైసిస్ ఛారిటీకి టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు
Last Updated : Mar 30, 2020, 3:09 PM IST