కృష్ణంరాజు.. టాలీవుడ్ రెబల్ స్టార్. ప్రభాస్.. యంగ్ రెబల్ స్టార్. ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ. కృష్ణంరాజు వారసుడిగా తెరంగ్రేటం చేసిన ప్రభాస్ తన నటనతో అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ఎలా ఉన్నాడో ఇప్పటికే అలానే ఉంటాడు ప్రభాస్.
కృష్ణంరాజుని ప్రభాస్ ఏమని పిలుస్తాడంటే..! - బాహుబలిbahubali
'బాహుబాలి', 'సాహో' చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఈ హీరో పెద్దనాన్న కృష్ణంరాజును ఏమని పిలుస్తాడో తెలుసా. అయితే ఇది చదివేయండి.
ప్రభాస్
ప్రభాస్ ప్రతి ఒక్కరిని డార్లింగ్ అంటూ ఆపాయ్యంగా పిలుస్తాడు. ప్రభాస్‌ను కూడా అభిమానులు, సినీ ప్రముఖులు డార్లింగ్ అనే పలకరిస్తారు. మరి పెద్దనాన్న కృష్ణంరాజు అంటే ఎంతో ఇష్టమైన ప్రభాస్ ఆయన్ను ఏమని పిలుస్తాడో తెలుసా? పెద్ద బాజీ అని పిలుస్తాడట. కృష్ణంరాజు భార్యను కన్నమ్మా అని అంటుంటాడు డార్లింగ్.
ఇవీ చూడండి.. 'అసురన్' దర్శకుడితో సూర్య చిత్రంపై క్లారిటీ