తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్ బర్త్​డే కానుకగా 'రాధేశ్యామ్' మోషన్​ పోస్టర్​ - radhey syam motion poster

యంగ్ రెబల్​స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'రాధే శ్యామ్'. ఈ సినిమా అప్​డేట్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది చిత్రబృందం.

prabhas birthday special radhe syam teaser
రాధేశ్యామ్

By

Published : Oct 20, 2020, 5:15 PM IST

'బాహుబలి', 'సాహో' తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం 'రాధే శ్యామ్'. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి అప్​డేట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఫ్యాన్స్​కు శుభవార్త చెప్పింది చిత్రబృందం.

ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా మోషన్​ పోస్టర్​ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' అంటూ ఈ పోస్ట్​ర్​కు పేరు పెట్టారు. అంటే మ్యూజిక్​తో కూడిన సర్​ప్రైజ్​ ఇచ్చేందుకు చిత్రబృందం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో ప్రభాస్​తో పాటు హీరోయిన్​ పూజా హెగ్డే, స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జి, ముర‌ళి శ‌ర్మ‌, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యాన్ త‌దిత‌రులు నటిస్తున్నారు.

ఇదీ చూడండి నిఖిల్ '18 పేజెస్' మొదలైంది

ABOUT THE AUTHOR

...view details