యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న 3డీ ఫిల్మ్ 'ఆది పురుష్'. ఓం రౌత్ దర్శకుడు. మంగళవారం ఉదయం టైటిల్‌తో పాటు, కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేయడం వల్ల ఈ సినిమాపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. పోస్టర్‌లో రామాయణ పాత్రలు కనిపించాయి. దీంతో బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ దీనిపైనే చర్చ మొదలైంది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపిస్తాడా? లేదా? ఆ పాత్ర లక్షణాలతో ప్రభాస్ పాత్ర సరికొత్తగా ఉంటుందా? ఇలా అనేక ప్రశ్నలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొట్టాయి. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్‌తో ప్రభాస్ పాత్రపై ఓ క్లారిటీ వచ్చింది.
రాముడిగా ప్రభాస్!.. నాగ్ అశ్విన్ ట్వీట్‌తో క్లారిటీ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలతో జోరు చూపిస్తున్నాడు. ఇటీవలే నాగ్ అశ్విన్‌తో భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రకటించిన డార్లింగ్.. ఈసారి బాలీవుడ్‌లో నేరుగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. 'తానాజీ' ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.
రాముడిగా ప్రభాస్
"ప్రభాస్‌గారిని రాముడిగా చూసేందుకు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా. ఆ పాత్రను వెండితెరపై చాలా కొద్దిమంది నటులు మాత్రమే పోషించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు" అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేయడ వల్ల 'ఆది పురుష్'లో ప్రభాస్ రాముడిగా కనిపిస్తాడని అర్థమవుతోంది. అయితే, దీనిపై చిత్ర బృందం మాత్రం ఎక్కడా స్పందించ లేదు.