తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హిందీ షోలో ప్రభాస్ డ్యాన్స్.. నెట్టింట ఫొటో వైరల్ - nach baliye 9

'సాహో' జంట ప్రభాస్, శ్రద్ధా కపూర్ 'నచ్ బలియే 9' డ్యాన్స్​ రియాలిటీ షోలో పాల్గొన్నారు. వేదికపై ప్రభాస్ డ్యాన్స్​తో సందడి చేశాడు.

సినిమా

By

Published : Aug 22, 2019, 9:41 AM IST

Updated : Sep 27, 2019, 8:43 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన చిత్రం 'సాహో'. యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్​లో బిజీగా ఉన్నారు హీరో హీరోయిన్లు. హిందీ ప్రేక్షకులకు చేరువ చేయడానికి ప్రభాస్, శ్రద్ధా బాలీవుడ్​ షోలలో పాల్గొంటున్నారు.

ప్రభాస్, శ్రద్ధా కలిసి ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్​ నిర్మాతగా వ్యవహరిస్తోన్న 'నచ్ బలియే 9' డ్యాన్స్​ రియాలిటీ షోలో పాల్గొన్నారు. యంగ్ రెబల్ స్టార్​ వేదికపై సందడి చేశాడు. షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోన్న నటి రవీనా టాండన్​ చీర కొంగును నోటితో పట్టుకుని 'కిక్​' సినిమాలో జుమ్మేకీ రాత్​ హై పాటకు స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

వేదికపై ప్రభాస్ డ్యాన్స్

'సాహో' సినిమాకు సుజిత్‌ దర్శకత్వం వహించగా.. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మురళీ శర్మ, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. తనీష్‌ బాగ్చి, జిబ్రాన్‌(నేపథ్య) సంగీతం అందించారు. రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్‌ అంచనాలకు తగ్గట్టే అందర్నీ ఆకట్టుకుంది.

ఇవీ చూడండి.. హౌస్​ఫుల్​4: ఓ పాట కోసం 200 మంది డ్యాన్సర్లు

Last Updated : Sep 27, 2019, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details