దర్శకుడు నాగ్ అశ్విన్-హీరో ప్రభాస్ కాంబినేషన్లో ప్రతిష్ఠాత్మకంగా ఓ సినిమా తెరకెక్కబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందనున్న ఈ పాన్ ఇండియా చిత్రం.. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అయితే తాజాగా ఓ కొత్త అప్టేట్‌ను తెలిపారు ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రతినిధి. కేవలం ఈ ఐదు భాషల్లోనే కాకుండా పాన్ వరల్డ్‌గా తెరకెక్కించి ఇంగ్లీష్‌లోనూ విడుదల చేసేలా చిత్రబృందం ప్రణాళికలు రచిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. త్వరలోనే స్పష్టత వస్తుందని అన్నారు.
పాన్ వరల్డ్‌గా ప్రభాస్- నాగ్అశ్విన్ సినిమా! - prabhas nagaswin movie release in english
ప్రభాస్-నాగ్అశ్విన్ కాంబోలో రాబోతున్న సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్ భాషలోనూ విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుందని ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రతినిధి తెలిపారు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని అన్నారు.
ప్రభాస్
"హాలీవుడ్ చిత్రాలు హిందీ, తమిళ్, తెలుగులో డబ్బింగ్ అవుతున్నాయి. మనవి ఎందుకు కాకూడదు. కొత్తగా ఉండాలని ఈ ప్రయోగాన్ని చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి." అని సదరు ప్రతినిధి తెలిపారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కూడా నటిస్తున్నారు.
ఇదీ చూడండి:ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది అప్పుడే