Prabhas Adipurush Release date: ఎంతో ఆసక్తిగా అభిమానులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ప్రభాస్ 'ఆదిపురుష్ ఒకటి. నేడు శివరాత్రి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కొత్త అప్డేట్ను ఇచ్చింది చిత్రబృందం. ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించింది. 2023 జనవరి 12న 3డీలో ప్రపంచవ్యాప్తంగా థియేటరల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.
Prabhas Adipurush: ప్రభాస్ 'ఆదిపురుష్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - ప్రభాస్ ఆదిపురుష్ అప్డేట్
Prabhas Adipurush Release date: ప్రభాస్ ప్రధాన పాత్రలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'ఆదిపురుష్' సినిమా కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించింది చిత్రబృందం. 2023 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది.
ప్రభాస్ ఆదిపురుష్
రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కృతిసనన్ సీత పాత్రలో కనిపించగా, నటుడు సైఫ్ అలీఖాన్ లంకేశుడిగా, బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో, మరాఠి నటుడు దేవ్దత్త నగే హనుమంతుడిగా కనువిందు చేయనున్నారు.