రెబల్‌స్టార్ ప్రభాస్(prabhas adipurush look) వరుస సినిమాల షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నాడు. భారీ ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్నాడు. ఇందులో ప్రస్తుతం 'ఆదిపురుష్', 'సలార్' షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి. 'ఆదిపురుష్'ను త్రీడీలోనూ తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11(prabhas adipurush release date)న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే వెల్లడించింది చిత్రబృందం. అందుకు తగ్గట్లే షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో పడింది.
తుదిదశకు ప్రభాస్ 'ఆదిపురుష్' షూటింగ్ - ప్రభాస్ 'ఆదిపురుష్' షూటింగ్
రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆదిపురుష్'(prabhas adipurush look). రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది.
ఈ సినిమాలోని తమ పాత్రలను ఇప్పటికే పూర్తి చేసుకున్నారు రావణ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్, సీత పాత్రధారి కృతి సనన్. ఇక ఇందులో రాముడిగా నటించనున్న ప్రభాస్(prabhas adipurush look)కు సంబంధించిన షూటింగ్‌ను వచ్చే నెలాఖరుకు పూర్తి చేయాలని భావిస్తున్నారు దర్శకుడు ఓంరౌత్. ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించడానికి ముందే రెబల్‌స్టార్‌కు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. భారీ వీఎఫ్క్స్తో రూపొందుతోన్న ఈ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లకు రావాలంటే వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేయాలని యూనిట్ భావిస్తోంది.