రెబల్‌స్టార్ ప్రభాస్(prabhas sandeep reddy vanga) అభిమానులకు తీపి కబురు. ఇప్పటికే వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆయన.. ఈసారి ఏకంగా పాన్‌వరల్డ్ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం సహా మూడు విదేశీ భాషల్లో ఈ మూవీని రూపొందించనున్నారు. 'అర్జున్‌రెడ్డి' దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా(sandeep vanga next project) దీన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి 'స్పిరిట్' అనే టైటిల్ ఖరారు చేశారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. 'డార్లింగ్'కు ఇది 25వ సినిమా కావడం విశేషం.
ప్రభాస్ 25వ సినిమా ఫిక్స్.. ఈసారి ఎనిమిది భాషల్లో - prabhas sandeep reddy vanga
ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలను ఓకే చేస్తూ వచ్చిన ప్రభాస్(prabhas sandeep reddy vanga) ఈ సారి పాన్ వరల్డ్ మూవీతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. తన 25వ సినిమాను 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాతో(sandeep vanga next project) చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చింది.
ప్రభాస్
ప్రభాస్(prabhas upcoming movie).. త్వరలోనే 'రాధేశ్యామ్' సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. దీంతో పాటే 'సలార్', 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలోనూ నటిస్తున్నారు.
ఇదీ చూడండి: రిలీజ్‌పై 'రాధేశ్యామ్' క్లారిటీ.. చెప్పిన తేదీకే
Last Updated : Oct 7, 2021, 11:28 AM IST