తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆదిపురుష్​'గా వస్తోన్న రెబల్​స్టార్​ ప్రభాస్​ - ఆదిపురుష్​ సినిమా అప్​డేట్​

బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్..​ మరోసారి పాన్​ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. 'తానాజీ' దర్శకుడు ఓమ్​ రౌత్​తో కలిసి ఓ చిత్రం చేయనున్నాడు. దానికి సంబంధించిన టైటిల్​ పోస్టర్​ను మంగళవారం విడుదల చేసింది చిత్రబృందం.

Prabhas 22 Titled Adipurush, Here's First Look Poster
ప్రభాస్​ కొత్త చిత్రం పేరు 'ఆదిపురుష్​'

By

Published : Aug 18, 2020, 7:53 AM IST

Updated : Aug 18, 2020, 10:30 AM IST

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​ మరో పాన్​ ఇండియా సినిమాలో నటించడానికి సిద్ధమయ్యాడు. బాలీవుడ్​ దర్శకుడు ఓమ్​ రౌత్​తో తన తర్వాతి చిత్రం ఉండబోతుందని సోమవారం ప్రకటించగా.. మంగళవారం ఉదయం 7.11 గంటలకు టైటిల్​ పోస్టర్​ను విడుదల చేశారు. దీనికి 'ఆదిపురుష్​' అనే టైటిల్​ను ఖరారు చేసింది చిత్రబందం.

ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో 3డీలో తెరకెక్కించనుండటం విశేషం. వచ్చే ఏడాదిలో షూటింగ్​ను ప్రారంభించి.. 2022లో సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తోంది. ఈ దర్శకుడు గతంలో అజయ్​ దేవగణ్​ హీరోగా 'తానాజీ' చిత్రాన్ని తెరకెక్కించారు.

సినిమాకు నిర్మాతలుగా టీ-సిరీస్​ భూషణ్​ కుమార్​, క్రిషన్​ కుమార్​ వ్యవహరిస్తున్నారు. టీ-సిరీస్​, రెట్రోఫిలీస్​ సంస్థలు సంయుక్తంగా ప్రొడక్షన్​ బాధ్యతలు స్వీకరించాయి.

ప్రభాస్​ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్​' చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత నాగ్​ అశ్విన్​ దర్శకత్వంలో ఓ సైన్స్​ ఫిక్షన్​ సినిమా చేయనున్నాడు. ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 'ఆది పురుష్​' పట్టాలెక్కనుంది.

Last Updated : Aug 18, 2020, 10:30 AM IST

ABOUT THE AUTHOR

...view details