*సూపర్ హిట్ చిత్రం 'కేజీఎఫ్'ను నిర్మించిన దక్షిణాది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ .. తాజాగా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 2న మధ్యాహ్నం 2.09గంటలకు ఈ చిత్ర వివరాలు వెల్లడించినున్నట్లు ట్వీట్ చేసింది. అయితే ఈ సినిమా 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్-హీరో ప్రభాస్ కాంబోలో ఉంటుందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
*టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య 20వ సినిమా టైటిల్‌ను 'లక్ష్య'గా ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శౌర్య.. ఆర్చరీ క్రీడాకారుడుగా ఎనినిది పలకల దేహంతో కనిపించనున్నారు.
*సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న హీరోయిన్ రాశీ ఖన్నా.. మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నారు.
*వసంత నాగేశ్వరావు దర్శకత్వంలో సంపూర్ణేష్ బాబు హీరోగా 'బజార్ రౌడీ' సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో సంపూ తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను మైమరిపించబోతున్నారు. తాజాగా రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకు సంబంధించి ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ట్వీట్ చేసింది చిత్రబృందం.
*ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా 'కరోనా వైరస్'. ఈ చిత్రాన్ని డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. లాక్డౌన్ తర్వాత రిలీజ్ కానున్న తొలి తెలుగు సినిమా కావడం విశేషం.
ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబోల సనిమా వచ్చే అవకాశం నాగశౌర్య 20వ సినిమా టైటిల్ 'లక్ష్య' రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కరోనా వైరస్' సినిమా