నందమూరి నటసింహం బాలకృష్ణ టైటిల్‌తో పవర్ స్టార్ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై... నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది. అసలు విషయమేంటంటేప్రముఖకన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ను అభిమానులు ముద్దుగా 'పవర్ స్టార్' అని పిలుచుకుంటారు. ఆయన హీరోగా నటించిన కొత్త చిత్రానికి 'యువరత్న' అనే టైటిల్‌ను పెట్టి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఒకప్పుడు నందమూరి బాలకృష్ణను అభిమానులు 'యువరత్న' అని పిలిచేవారు. ఇప్పుడు ఆ పేరునే పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తన సినిమాకు టైటిల్‌గా పెట్టుకున్నాడు. గతంలో 'యువరత్న' టైటిల్‌తో తారకరత్న హీరోగా ఓ సినిమానూ వచ్చింది.
నెట్టింట దూసుకెళ్తోంది...
తాజాగా విడుదలైన 'యువతర్న'లో రగ్బీ క్రీడాకారుడిగా సందడి చేయనున్నాడు పునీత్. దీనికి సంతోష్ ఆనంద్రామ్ దర్శకుడు. సాయేషా ఈ సినిమాతో కన్నడ తెరపై హీరోయిన్గా అరంగేట్రం చేస్తోంది.
సీనియర్ నటుడు బొమన్ ఇరానీ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. హోమ్‌బలే ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోందీ సినిమా. గతంలో 'కేజీఎఫ్' చిత్రాన్ని ఇదే సంస్థ నిర్మించింది. తమన్ బాణీలు సమకూర్చుతున్నాడు. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ప్రస్తుతం పునీత్ 'జేమ్స ఇన్ హిజ్ కిట్టీ' అనే మరో సినిమాలోనూ నటిస్తున్నాడు.
మంచి బంధాలున్నాయి...
రాజ్ కుమార్ కుటుంబంతో నందమూరి ఫ్యామిలీకి మంచి అనుబంధముంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలను కన్నడలో రాజ్ కుమార్ రీమేక్ చేసి మంచి విజయాలు అందుకున్నాడు. బాలకృష్ణ వందో సినిమా 'గౌతమి పుత్ర శాతకర్ణి'లో పునీత్ తండ్రి శివరాజ్ కుమార్ ఒక పాటలో అతిథిగానూ కనిపించాడు.