ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. తన భద్రతా సిబ్బందితోపాటు వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, వైద్యుల సూచనల మేరకు పవన్ క్వారంటైన్‌లోకి వెళ్లారు.
హోం క్వారంటైన్‌లోకి పవన్‌కల్యాణ్ - pawan home quarantine news
![హోం క్వారంటైన్‌లోకి పవన్‌కల్యాణ్ powerstar Pawan Kalyan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11362798-745-11362798-1618127158016.jpg)
హోం క్వారంటైన్‌లోకి పవన్‌కల్యాణ్
12:59 April 11
హోం క్వారంటైన్‌లోకి పవన్‌కల్యాణ్
వారం రోజుల నుంచి పవన్‌కు సన్నిహితంగా ఉన్న వారిలో ఒక్కొక్కరిగా కరోనా బారినపడ్డారు. అప్రమత్తమైన పవర్ స్టార్.. వారందరికి దూరంగా ఉంటూ టెలి కాన్ఫరెన్స్‌లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
ఇటీవల తన తాజా చిత్రం వకీల్ సాబ్ విడుదలైంది. ఆ సినిమా ముందస్తు విడుదల వేడుకకు హాజరైన పవన్ కల్యాణ్... ఆ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు.
ఇవీచూడండి:మాస్కులు ధరించి సినిమా చూడండి.. ప్రేక్షకులకు పవన్ విజ్ఞప్తి
Last Updated : Apr 11, 2021, 2:54 PM IST