పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'వకీల్ సాబ్' సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని అభిమానులు వేచి చూస్తున్నారు. తాజాగా 'వకీల్ సాబ్' మోస్ట్ ట్వీటెడ్ తెలుగు సినిమాగా ట్విట్టర్లో రికార్డు సృష్టించింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
'వకీల్ సాబ్'.. వచ్చేది అప్పుడేనా? - శ్రుతి హాసన్
'వకీల్ సాబ్' సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ డేట్ ప్రకటించకపోవడమే ఇందుకు కారణం.
మోస్ట్ ట్వీటెడ్ తెలుగు సినిమాగా 'వకీల్ సాబ్'
కరోనా కారణంగా సినిమా చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ తెరపై కనిపించి మూడేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో.. 'వకీల్ సాబ్' విడుదల కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఇప్పటివరకు సినిమా విడుదలపై ఎలాంటి సమాచారం లేదు. దీంతో మూవీ వచ్చే ఏడాది వేసవి కాలం నాటికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనుకుంటున్నారు.