పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్.. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'వకీల్‌సాబ్' చిత్రీకరణలో పవన్ పాల్గొనగా.. అక్కడికి చేరుకున్న క్రిష్‌కు పవర్‌స్టార్ పుష్పగుచ్ఛం ఇచ్చి విషెష్ తెలిపారు.
క్రిష్‌కు ప్రత్యేకంగా విషెస్ తెలిపిన పవర్ స్టార్ - దర్శకుడు క్రిష్ వార్తలు
ఉత్తమ చిత్రాల దర్శకుడు క్రిష్ పుట్టినరోజు సందర్భంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లోని 'వకీల్‌సాబ్' షూటింగ్ సెట్లో క్రిష్‌కు పవన్ పుష్పగుచ్ఛం ఇచ్చి విషెస్ తెలిపారు.
'వకీల్‌సాబ్' సెట్లో క్రిష్.. విషెస్ చెప్పిన పవర్‌స్టార్
క్రిష్ పుట్టినరోజు సందర్భంగా ముందుగా పూల బోకేను పంపిన పవన్ కల్యాణ్.. దర్శకుడు కలిసిన తర్వాత మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. క్రిష్‌తో పాటు నిర్మాత ఏఎమ్ రత్నం పవన్‌ను కలిశారు. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.