"మన దేశంలో లక్ష మందిలో ఒకరికి సొంత భవనం ఉంది. వేయి మందిలో ఒకరికి సొంత కారు ఉంది. వంద మందిలో ఒకరికి సొంత కంప్యూటర్ ఉంది. కానీ ప్రతి పది మందిలో ఇద్దరి దగ్గర తుపాకీ గాని కత్తి గాని ఉంది. అంటే ఇక్కడ మనకి బతికే అవకాశం కంటే చచ్చే సౌకర్యం ఎక్కువ అని నాకో ఫ్రెండ్ చెప్పాడు. అతను తన దగ్గర కుంగ్‌ఫూ నేర్చుకోవడానికి వచ్చిన కుర్రాడికి చెప్పిన మాట నేనెప్పటికీ మర్చిపోలేను. 'యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు...' ఈ మాటను అతను పూర్తి చేస్తేనే బావుంటుంది. అతని పేరు సంజయ్ సాహు" అంటూ మహేశ్‌బాబు గాత్రంతో ప్రారంభమైన సినిమా 'జల్సా'.
పవర్‌స్టార్.. సూపర్‌స్టార్ కాంబినేషన్‌కు 12 ఏళ్లు - entertainment news
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కలిసి ఓ సినిమా చేస్తే చూడాలనేది అభిమానుల కోరిక. దానిని కొంతమేర తీర్చిన చిత్రం 'జల్సా'. ప్రేక్షకుల ముందుకొచ్చి, నేటికి సరిగ్గా 12 ఏళ్లు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు, అందులోని పవర్ఫుల్ డైలాగ్‌లు మీకోసం.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్
'ఖుషీ' తర్వాత పవన్‌కు సరైన హిట్ పడటం లేదని బాధపడుతున్న పవన్ అభిమానుల ఆకలి తీర్చిన సినిమా ఇది. హాస్యం, భావోద్వేగం, రొమాన్స్.. ఇలా ఒకటేమిటి ఎన్నో అంశాల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను స్టార్ డైరెక్టర్‌ను చేసింది. ఇందులో పవన్ నక్స్‌లైట్‌గా చెగువేరా వేషధారణలో కనిపించడం మరో విశేషం. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలైతే ఇప్పటికే ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి ఈ చిత్రంలోని అద్భుతమైన డైలాగ్స్‌పై ఓ లుక్కేయండి.
- యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు ఓడించడం
- అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగితే అది రొమాన్స్.. అబ్బాయిల చుట్టూ అమ్మాయిల తిరిగితే అది నాన్సెన్స్
- అమ్మాయి అంటే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లా ఉండకూడదు. ఎవరుపడితే వాడొచ్చేస్తాడు. ఎవరెస్ట్‌లా ఉండాలి.
- ఆకలేస్తున్నప్పుడు అన్నం ఉండి తినకపోవడం ఉపవాసం.. నిద్ర వస్తున్నప్పుడు కళ్లెదురుగా మంచం ఉండి నిద్రపోకపోవడం జాగారం.. మన చేతిలో ఆయుధం ఉండి మన ఎదురుగా శత్రువు ఉంటే చంపకపోవడం మానవత్వం
- రొమాన్స్‌ను కాపీ కొట్టడం అంటే ఇండిపెండెన్స్ డే రోజు బ్రిటిష్ కంపెనీ చాక్లెట్స్ పంచినంత పాపమే
- ఒక మనిషిలో కోపం ఉంటే అంటే శక్తి.. అదే ఒక గుంపులో ఉంటే ఉద్యమం
- దేవదాస్ పార్వతి కోసం సీసాలు సీసాలు తాగాడు కానీ పార్వతి, దేవదాసు కోసం ఒక్క పెగ్ అయినా తాగిందా?
- అందంగా ఉండటం అంటే మనకు నచ్చేలా ఉండటం.. ఎదుటివాళ్లకు నచ్చినట్లు కాదు