రీఎంట్రీలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ జోరు చూపిస్తున్నాడు. మూడు సినిమాలు ఒప్పుకొని, వాటిలో రెండింటికి సంబంధించి షూటింగ్‌ల్లో పాల్గొంటున్నాడు. వాటిలో ఒకటి 'వకీల్‌సాబ్'.. రెండోది క్రిష్‌తో చేస్తున్నాడు. అయితే ఈ రెండు చిత్రాలు ఈఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
'పింక్' రీమేక్‌గా రూపొందిస్తున్న 'వకీల్‌సాబ్'లో లాయర్‌గా కనిపించనున్నాడు పవన్. ఈ సినిమా వేసవిలో రానుంది. క్రిష్ తీస్తున్న చిత్రం చారిత్రక కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. అయితే దీపావళి కానుకగా ఈ ప్రాజెక్టును థియేటర్లలోకి తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు. ఇదే నిజమైతే ఎనిమిదేళ్ల తర్వాత ఒకే ఏడాదిలో పవన్ రెండు సినిమాలు వచ్చినట్లవుతుంది.