గత కొన్నిరోజులగా కరోనాతో పోరాడిన బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్-ఆలియా భట్.. వైరస్ నుంచి ఇటీవల పూర్తిగా కోలుకున్నారు. ఇప్పుడు ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు మాల్దీవులు విహారయాత్రకు వెళ్లారు. సోమవారం ఉదయం ముంబయి విమానాశ్రయంలో వైట్ అండ్ వైట్ దుస్తుల్లో వీరిద్దరూ కనిపించడం వల్ల ఈ విషయం తెలిసింది.
మాల్దీవులు విహారయాత్రకు బాలీవుడ్ లవ్‌బర్డ్స్! - ఆలియా రణ్‌బీర్ న్యూస్ లేటేస్ట్
రూమర్ గర్ల్‌ఫ్రెండ్ ఆలియా భట్‌తో కలిసి హీరో రణ్‌బీర్ కపూర్, మాల్దీవులు విహారయాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కరోనా నుంచి ఇటీవలే కోలుకున్నారు.
ఆలియా భట్ రణ్‌బీర్ కపూర్
ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'తో పాటు 'గంగూబాయ్ కతియావాడి', 'తఖ్త్' తదితర సినిమాల్లో నటిస్తూ ఆలియా బిజీగా ఉంది. 'బ్రహ్మాస్త్ర', 'షంషేరా' సినిమా షూటింగ్‌ల్లో రణ్‌బీర్ పాల్గొనాల్సి ఉంది.
ఇది చదవండి:సినీపరిశ్రమపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం