అశ్లీల చిత్రాల దందా కేసులో అరెస్టైన నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా(Rajkundra porn case), రియాన్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. తమను అరెస్ట్ చేయడం, రిమాండ్‌లో ఉంచడాన్ని సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టిపారేసింది న్యాయస్థానం. మెజిస్ట్రేట్ వారిని పోలీస్ కస్టడీకి పంపించాలని తీసుకున్న నిర్ణయం చట్టపరంగానే జరిగిందని, అందులో తాము జోక్యం చేసుకోవడం అనవసరమని పేర్కొంది.
పోర్నోగ్రఫీ కేసు: కుంద్రా పిటిషన్ కొట్టివేత - Rajkundra highcourt
పోర్న్ కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ రాజ్‌కుంద్రా(Rajkundra porn case) దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు దానిని కొట్టిపారేసింది. కుంద్రాను పోలీస్ కస్టడీకి పంపించడం చట్టపరంగానే జరిగిందని, అందులో తాము జోక్యం చేసుకోవడం అవసరం లేదని వెల్లడించింది.
రాజ్‌కుంద్రా
అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో ముంబయి పోలీసులు జులై 19న రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలను నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో గత ఫిబ్రవరిలో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి దీనిపై దర్యాప్తు సాగిస్తున్న అధికారులు.. సాక్ష్యాలను సేకరించి కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు.