తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రముఖ సీనియర్​ నటుడు కన్నుమూత - టీవీ యాక్టర్​ అనుపమ్​ శ్యామ్​ మృతి

ప్రముఖ బాలీవుడ్​ నటుడు అనుపమ్​ శ్యామ్​(63) అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

anupam syam
అనుపమ్​ శ్యామ్​

By

Published : Aug 9, 2021, 9:51 AM IST

ప్రముఖ బాలీవుడ్​ నటుడు అనుపమ్​ శ్యామ్​(63) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

అనుపమ్​.. 'మన్​కీ ఆవాజ్​ ప్రతిజ్ఞ' సీరియల్​తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా పలు ధారావాహికల్లోనూ నటించారు. 'స్లమ్​డాగ్​ మిలియనీర్'​, 'బందిపోటు', 'క్వీన్' వంటి​ చిత్రాల్లోనూ కనిపించారు.

ఇదీ చూడండి: వెబ్​సిరీస్​తో వర్మ.. అన్నాచెల్లెళ్లుగా నవీన్, అవికా

ABOUT THE AUTHOR

...view details