కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కోసం పోరాడుతున్న కొవిడ్ రోగులను ఆదుకునేందుకు ప్రముఖ నేపథ్య గాయనీ, తెలుగు పాప్ సింగర్ స్మిత(Singer Smitha) ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని 6 జిల్లాలను ఎంపిక చేసుకొని ఈయో ఆంధ్రప్రదేశ్, అలై ఫౌండేషన్ల ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ల(Covid Care Centers)కు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ బెడ్స్, కాన్సంట్రేటర్లను సరఫరా చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఆయా సంస్థల వాలంటీర్లతో కలిసి బాధితులకు ఆసరగా నిలుస్తున్న స్మిత... ప్రస్తుత పరిస్థితుల్లో ఆకలి తీర్చడం ఎంత ముఖ్యమో... ఆక్సిజన్ అందించడం అంతే అవసరమంటోంది. ఇందుకోసం ప్రత్యేకంగా 'స్మితకేర్'(Smitha Care) పేరుతో ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్(Help Line Center) ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు తోడుగా ఉంటోంది. 100కుపైగా ఆక్సిజన్ బెడ్స్, 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లను కొవిడ్ సెంటర్లకు అందించిన స్మితతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
Singer Smitha: ఈసారి సమస్య ఆకలి కాదు... ఆక్సిజన్ - ఆక్సిజన్ అవసరం
''మొదటిసారి కొవిడ్ వల్ల ఎంతోమంది ఆకలితో అల్లాడిపోయారు. ఈసారి సమస్య ఆకలి కాదు... ఆక్సిజన్. ఈ సెకండ్‌వేవ్‌లో దాని అవసరమే ఎక్కువగా కనిపిస్తోంది. నాకు తెలిసిన వాళ్లు, బంధువులు, మా ఉద్యోగులు ఫోన్లు చేసి సాయం కావాలని అడిగినప్పుడు... ఆస్పత్రుల్లో బెడ్లు ఏర్పాటు చేశా. వాళ్లలో చాలా మంది కోలుకుని సంతోషంగా ఇంటికెళ్లిపోయారు. కొంతమంది మాత్రం చనిపోయారు. బాధనిపించింది.'' -పాప్ సింగర్ స్మిత
ఈసారి సమస్య ఆకలి కాదు... ఆక్సిజన్