పాప్ సింగర్ స్మిత దంపతులకు కరోనా పాజిటివ్ - గాయని స్మిత భర్తకు కరోనా
ప్రముఖ గాయని స్మిత, ఆమె భర్త శశాంక్‌కు కరోనా వైరస్ సోకినట్టు ట్వట్టర్లో తెలిపింది. త్వరలోనే కోలుకొని ప్లాస్మా దానం చేస్తానని వెల్లడించింది.

పాప్ సింగర్ స్మిత దంపతులకు కరోనా పాజిటివ్
ప్రముఖ పాప్ సింగర్ స్మిత కొవిడ్ బారిన పడ్డారు. అధిక వ్యాయామం చేయడం వల్ల దేహం అలిసిపోయిందని భావించిన స్మిత... అనుమానంతో తన తన భర్త శశాంక్‌తో కలిసి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఇరువురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్మిత తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ప్రాథమిక లక్షణాలు మాత్రమే ఉన్నాయని, త్వరలోనే కరోనా నుంచి కోలుకుంటానని స్పష్టం చేసిన స్మిత... ప్లాస్మా దానం చేయనున్నట్లు తెలిపారు. అందరూ ఇళ్లలో జాగ్రత్తగా, ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.
Last Updated : Aug 4, 2020, 7:31 PM IST