వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. మరోసారి తన భర్త సామ్ బాంబేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేశాడని కంప్లెయింట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది! కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
"సామ్ బాంబేపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నాం. పూనమ్ ముఖంపై తీవ్రంగా గాయాలు ఉన్నాయి. ఆమె ఫిర్యాదు చేసిన అనంతరం ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నాం" అని ఓ అధికారి వెల్లడించారు.