తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శిల్పాశెట్టి భర్తపై పూనమ్ పాండే క్రిమినల్ కేసు - entertainment news

గత కొద్దికాలం నుంచి తనను మానసికంగా వేధిస్తున్నారని నటి పూనమ్​ పాండే.. రాజ్ కుంద్రాపై క్రిమినల్ కేసు పెట్టింది. పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది.

శిల్పాశెట్టి భర్తపై పునమ్ పాండే క్రిమినల్ కేసు
నటి పూనమ్ పాండే

By

Published : Feb 9, 2020, 7:35 PM IST

Updated : Feb 29, 2020, 7:02 PM IST

బాలీవుడ్ నటి, సోషల్ మీడియా సెలబ్రిటీ పూనమ్​ పాండే.. నటి శిల్పాశెట్టి భర్త రాజ్​ కుంద్రాపై క్రిమినల్ కేసు పెట్టింది. అతడి వల్ల గత కొద్ది నెలల నుంచి మానసిక క్షోభకు గురవతున్నానని పేర్కొంది.

గతంలో పూనమ్.. ఓ మొబైల్ యాప్​ కోసం రాజ్ కుంద్రా భాగస్వామిగా ఉన్న ఆర్మ్స్​ ప్రైమ్ మీడియాను సంప్రదించింది. అనంతరం కొన్ని కారణాల వల్ల తప్పుకుంది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత నుంచి తనకు అదే పనిగా, కొత్త నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పిందీ భామ.

భర్త రాజ్​కుంద్రాతో నటి శిల్పాశెట్టి

ఆ తర్వాత రాజ్​కు సహాయకుడు అయిన సౌరభ్ కుశ్వాను సంప్రదించి, ఈ వేధింపులు ఆపాలని కోరినట్లు పూనమ్ చెప్పింది. అది తగ్గకపోగా, తనకు ఫోన్లు రావడం ఇంకా ఎక్కువయ్యాయని ఫిర్యాదులో పేర్కొందీ భామ.​

ఈ విషయంపై రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. పూనమ్​ తనపై చేసిన ఆరోపణల్ని ఖండించాడు. సదరు కంపెనీలో తన వాటాను ఎప్పుడో అమ్మేశానని అన్నాడు. ఈ ఒప్పందం రద్దయిన తర్వాత పూనమ్​తో సౌరభ్ సంప్రదింపులు జరపడం ఆపేశాడని చెప్పాడు.

Last Updated : Feb 29, 2020, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details