తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లాక్​డౌన్​ అతిక్రమించిన పూనమ్​పై కేసు - పూనమ్​ పాండేపై కేసు నమోదు

లాక్​డౌన్​ అతిక్రమించిన కారణంగా ప్రముఖ మోడల్​, నటి పూనమ్​ పాండేపై ముంబయిలో కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్దంగా తన వాహనంతో మెరైన్​ డ్రైవ్​ ప్రాంతంలో సంచరించినందుకుగానూ పూనమ్​తో పాటు ఆమె స్నేహితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Poonam Pandey booked for flouting lockdown norms
లాక్​డౌన్​ అతిక్రమించినందుకు పూనమ్​పాండేపై కేసు

By

Published : May 11, 2020, 2:50 PM IST

కరోనా లాక్​డౌన్​ నిబంధనలను అతిక్రమించిన కారణంగా ప్రముఖ మోడల్​, నటి పూనమ్​ పాండేపై కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న నిబంధనలను అతిక్రమిస్తూ.. ఆదివారం ముంబయిలోని మెరైన్​ డ్రైవ్​ ప్రాంతంలో కారులో చక్కర్లు కొడుతూ మెరైన్ పోలీసులకు చిక్కిందీ నటి.

"లాక్​డౌన్​ను అతిక్రమిస్తూ బయట సంచరిస్తున్న పూనమ్​ పాండే.. ఆమె స్నేహితుడు శామ్​ అహ్మద్​ బాంబేపై కేసు నమోదైంది. జాతీయ విపత్తు చట్ట రూల్స్ ప్రకారం నిబంధనలను ఉల్లఘించిన కారణంగా భారతీయ శిక్షాస్మృతి సెక్షన్​​ 46, 269, 188ల కింద కేసు నమోదు చేసి.. వాహనాన్ని సీజ్​ చేశాం." - ముంబయి సీనియర్​ పోలీసు అధికారి

పూనమ్​.. గతంలో నటి శిల్పాశెట్టి భర్త రాజ్​కుంద్రాపై బొంబాయి హైకోర్టులో ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఆరోపణలను కుంద్రా అతని సహచరుడు సౌరభ్ కుష్వా పాండే ఖండించారు. హైకోర్టు నుంచి తమకు ఎలాంటి నోటీసులు అందలేదని వారు తెలిపారు.

ఇదీ చూడండి.. సల్మాన్​.. 'తేరే బినా' టీజర్​ విడుదల

ABOUT THE AUTHOR

...view details