తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Tollywood Drugs Case: డ్రగ్స్​ కేసుపై పూనమ్​ సంచలన ట్వీట్! - poonam kaur drugs case

టాలీవుడ్​లో డ్రగ్స్​ కేసు(Tollywood Drugs Case) హాట్​టాపిక్​గా మారింది. ఈ నేపథ్యంలో నటి పూనమ్​ కౌర్(Poonam Kaur tweet) సంచలన ట్వీట్ చేశారు. డ్రగ్స్‌ అనేది కేవలం సెలబ్రిటీలకు సంబంధించిన అంశం మాత్రమే కాదని అన్నారు. త్వరలోనే దీనిపై తన అనుభవాలను పంచుకుంటానని వెల్లడించారు.

poonam kaur
పూనమ్ కౌర్

By

Published : Sep 4, 2021, 6:58 AM IST

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ కేసు(Tollywood Drugs Case) హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి మనీలాండరింగ్‌ ఏమైనా జరిగిందా? అన్న కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌రేట్‌(ఈడీ) పలువురు సినీ తారలను ప్రశ్నిస్తోంది. దర్శకుడు పూరి జగన్నాథ్‌(Puri Jagannadh), నటి ఛార్మిలను ఈడీ ఇప్పటికే విచారించగా.. సెప్టెంబరు 3(శుక్రవారం) కథానాయిక రకుల్‌ కూడా ఈడీ ఎదుట హాజరైంది. ఈ సందర్భంగా నటి పూనమ్‌ కౌర్‌(Poonam Kaur tweet) ట్విట్టర్ వేదికగా స్పందించారు. డ్రగ్స్‌ అనేది కేవలం సెలబ్రిటీలకు సంబంధించిన అంశం మాత్రమే కాదని అన్నారు.

"డ్రగ్స్‌ కేవలం సెలబ్రిటీలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఇది ప్రతీ ఒక్కరిది. ఇది ఒక సరిహద్దు సమస్యలాంటిది. రాజకీయ అజెండాకు సంబంధించింది. ఒక బలమైన ఆర్థిక వ్యవస్థకు సమానమైంది. ఈ విషయంపై నేను మాట్లాడాలనుకుంటున్నా. త్వరలోనే నా అనుభవాలను పంచుకుంటా"

--పూనమ్‌ కౌర్, ట్వీట్.

డ్రగ్స్‌ కేసులో(Drugs Case News) మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ(Enforcement Directorate) ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఆరో తేదీన ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే, షూటింగ్స్‌ ఉండటం వల్ల తాను హాజరు కాలేకపోతున్నానని.. కాస్త గడువు ఇవ్వాలని ఈడీ అధికారులను రకుల్‌ కోరారు. అందుకు అంగీకరించని అధికారులు.. మూడు రోజుల ముందుగానే విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఆమె ముందుగానే ఈడీ ఎదుట హాజరయ్యారు. మరోవైపు 8న రానా ఈడీ విచారణకు రానున్నారు.

ఇదీ చదవండి:పోసానికి నటి పూనమ్​ కౌర్​ కౌంటర్​

ABOUT THE AUTHOR

...view details