"అఖిల్ ఒక సినిమా ఫలితం కన్నా.. దానికోసం సిద్ధమయ్యే ప్రక్రియని ఎంతో ప్రేమిస్తాడు. తనలోని ఆ లక్షణం నాకెంతో నచ్చుతుంది" అన్నారు కథానాయకుడు నాగచైతన్య. హైదరాబాద్‌లో జరిగిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'(akhil pooja hegde movie name) చిత్ర విడుదల ముందస్తు వేడుకకు(most eligible bachelor pre release event) ముఖ్య అతిథిగా హాజరైన చైతూ ఈ వ్యాఖ్య చేశారు. అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రమిది. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించారు. బన్నీవాసు, వాసువర్మ నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 15న రానుంది.
నాగచైతన్య(nagachaitanya lovestory movie) మాట్లాడుతూ "భాస్కర్ మనుషుల మధ్య ఉండే అనుబంధాల్ని, భావోద్వేగాల్ని చాలా బాగా డీల్ చేస్తాడు. అఖిల్ కెరీర్‌ని స్టార్ట్ చేసి నాలుగేళ్లు అవుతోంది. రోజూ ఇంట్లో ఓ కొత్త అఖిల్‌ను చూస్తుంటా. ట్రైలర్ చూస్తుంటే ఓ వేడుకలా అనిపించింది. ఈ సమయంలో థియేటర్లలో అలాంటి ఓ వేడుకే కావాలి. అది ఈ సినిమా భర్తీ చేస్తుందని నమ్ముతున్నా" అన్నారు.
అఖిల్ మాట్లాడుతూ(akhil most eligible bachelor movie release date)" గర్వంగా చెబుతున్నాం.. మేమందరం ఓ మంచి సినిమా తీశాం. భాస్కర్ సినిమాలు, కథలు నాకు చాలా ఇష్టం. ఆయన మెదడులో యుద్ధాలు జరుగుతుంటాయి. ఓ సీన్‌ను ఎలా తీయాలి అని ఎప్పుడూ తపన పడుతుంటాడు. పూజా హార్డ్ వర్క్ నాకెప్పుడూ స్ఫూర్తినిస్తుంటుంది. కొవిడ్ పరిస్థితుల తర్వాత థియేటర్లలో సినిమాలు ఆడతాయా? లేదా? అనుకుంటున్న సమయంలో 'లవ్‌స్టోరీ' సినిమా మాకు ఓ నమ్మకాన్ని అందించింది. ఇప్పుడా నమ్మకాన్ని అందిపుచ్చుకునే మేము అక్టోబరు 15న థియేటర్లలోకి వస్తున్నాం. మంచి రోజులు రాబోతున్నాయి. వంద శాతం ఆక్యుపెన్సీ వస్తుందని కోరుకుంటూ.. కచ్చితంగా గత వైభవాన్ని మళ్లీ చూస్తామని నమ్ముతున్నా. మనం సినిమాలు తీసేదే థియేటర్ల కోసం. అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు రండి. నవ్వుల థెరపీని అనుభూతి చెందండి. ఇక కొవిడ్‌ను మర్చిపోండి" అన్నారు.