తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అదంతా ఓ మాయ.. అందుకే సినిమాల్లో ఉన్నాను: పూజాహెగ్డే - పూజా హెగ్డే రాధేశ్యామ్​

Radheshyam Poojahegdey: స్టార్​ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్​ పూజాహెగ్డే.. త్వరలోనే 'రాధేశ్యామ్'​తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. కెరీర్​లో ఎన్నో పరాజయాలను చూసినట్లు తెలిపారు. ఒక చరిత్ర సృష్టించాలని సినిమాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.

Radheshyam Poojahegdey
Radheshyam Poojahegdey

By

Published : Mar 6, 2022, 2:04 PM IST

Updated : Mar 6, 2022, 2:10 PM IST

Radheshyam Poojahegdey: కెరీర్​లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు స్టార్​ హీరోయిన్​ పూజాహెగ్డే. త్వరలోనే 'రాధేశ్యామ్‌'తో ప్రేక్షకుల ముందు సందడి చేయనున్నారు. దీంతోపాటే 'బీస్ట్‌', 'SSMB 28' సహా పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో బ్యాక్‌ టు బ్యాక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు సిద్ధమైన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు.

ఇంకా ఆ ప్రయత్నం చేయలేదు..!

కోలీవుడ్‌లో తెరకెక్కిన 'ముగమూదీ'తో నటిగా నా కెరీర్‌ మొదలైంది. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కోలీవుడ్‌ పరిశ్రమ వల్లనే. అందుకే నాకు కోలీవుడ్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం. పదేళ్ల తర్వాత ‘బీస్ట్‌’తో మళ్లీ కోలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చింది. ‘రాధేశ్యామ్‌’ తమిళ వెర్షన్‌లో నా పాత్రకు నేను డబ్బింగ్‌ చెప్పుకోలేదు. భవిష్యత్తులో తమిళంలోనూ డబ్బింగ్‌ చెప్పుకోవాలని ఉంది.

పరాజయాలు చూశా..!

నేను బిజీగా ఉండే నటినని అందరూ చెప్పుకొంటున్నారు. నిజం చెప్పాలంటే.. నేను కూడా ఎన్నో పరాజయాలు చవి చూశాను. గతంలో నాకు అవకాశాలు కూడా రాలేదు. కానీ, ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తున్నందుకు ఆనందిస్తున్నా.

అదంతా ఒక మాయ..!

ఇండస్ట్రీలో నంబర్స్‌ గేమ్‌ ఎప్పుడూ ఉంటుంది. నా దృష్టిలో నం.1 అనేది ఒక మాయ. అలా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. దాని కోసం నేను వర్క్‌ చేయడం లేదు. ఒక చరిత్ర సృష్టించాలని పనిచేస్తున్నా. నా సినిమాలతో ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపాలని భావిస్తున్నా.

ఇదీ చూడండి:Janhvi kapoor Birthday: జాన్వీ గ్లామర్​ షో.. ఓ లుక్కేయండి

Last Updated : Mar 6, 2022, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details