ప్రముఖ నటి పూజా కుమార్.. ఈ మధ్య నెట్టింట బాగా హల్చల్ చేసింది. కోలీవుడ్ హీరో కమల్ హాసన్ ఇటీవలే 65వ పుట్టినరోజు వేడుకలను సొంత ఊరు పరమకుడిలో జరుపుకొన్నారు. ఆ సందర్భంగా కమల్ కుటుంబంతో పాటు పూజా ఉండటమే ఇందుకు కారణం.
కమల్‌తో 'విశ్వరూపం', 'ఉత్తమ విలన్', 'విశ్వరూపం 2'లో నటించింది పూజా. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్‌లతో కలిసి దిగిన ఫొటోను ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
"నేను గొప్ప అదృష్టవంతురాలిని. భారతదేశం గర్వించదగ్గ ఇద్దరు మహానుభావుల మధ్య ఉన్నాను. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను"